అక్షరటుడే, ఇందూరు: Police Service Medals | కొత్త సంవత్సరం new year సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం Telangana state government కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న అధికారులు, సిబ్బందికి సేవా పతకాలతో సత్కరించనుంది. మహోన్నత సేవా పతకం , ఉత్తమ సేవా పతకం , సేవా పతకాలు అందించే ఏర్పాటు చేసింది. అర్హులైన వారి జాబితాను విడుదల చేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఎంపికైన వారిలో ఎవరెవరు ఉన్నారంటే..
Police Service Medals | మహోన్నత సేవా పతకం
- ఎస్.సంతోష్ రెడ్డి , ఎస్సై , జిల్లా స్పెషల్ బ్రాంచ్
Police Service Medals | ఉత్తమ సేవా పతకాలు
- నాగభూషణం ఏఎస్ఐ ఇందల్వాయి పిఎస్
- షేక్ గఫర్ ఏఎస్ఐ నవీపేట్ పీఎస్
- జగదీశ్వర్, హెడ్ కానిస్టేబుల్ :1345 , స్పెషల్ బ్రాంచ్
సేవా పతకాలు
- బీ శ్రీనివాస్ – ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నార్త్ రూరల్ సర్కిల్
- బాదావత్ శివరాం – ఎస్సై, సీసీఆర్బీ
- ఏ ఆనంద్ సాగర్ – ఎస్సై, వీఆర్
- ఖాన్ హబీబ్ – ఎస్సై, బోధన్ టౌన్ పీఎస్
- పి రాజేశ్వర్ – ఎస్సై, వీఆర్
- వడ్డే ఉదయ్ కుమార్ – ఎస్సై, టౌన్ 4 పీఎస్
- సంజీవ రావు – ఎస్సై, మహిళా పోలీస్ స్టేషన్
- విట్టల్ రావు – ఎస్సై, సీసీఎస్ పీఎస్
- రాజేందర్ – ఏఎస్ఐ, నందిపేట్ పీఎస్
- ఎండి అబ్దుల్ రహీం – ఏఎస్ఐ, 1 టౌన్ పీఎస్
- పసుపుల రాజేశ్వర్ – హెడ్ కానిస్టేబుల్, 1362 మహిళా పోలీస్ స్టేషన్
- పోచమ్మ కాడి మోహన్ – హెడ్ కానిస్టేబుల్, సీసీఎస్ పీఎస్
- బెగ్ బిస్మిల్లా – ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, 82 హెడ్ క్వార్టర్
- కథావత్ రామారావు – కానిస్టేబుల్, 1860 ఇందల్వాయి పీఎస్
- చాట్ల సుభాష్ – కానిస్టేబుల్, 1852 సీసీఎస్ పీఎస్
వివిధ పతకాలకు ఎంపికైన నిజామాబాద్ జిల్లా పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందనలు తెలిపారు. ప్రజలకు మరింత చేరువై బాధ్యతాయుతంగా నిబద్ధతతో అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఉత్తమ సేవలు అందించే పోలీసు అధికారుల కృషి వల్ల పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు.
ఈ విజయాలు ఇతర సిబ్బందికి కూడా ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు, సమాజానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.