అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో కొందరు అక్రమంగా గుట్కా తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఫ్యాక్టరీపై దాడులు చేశారు.
నగర శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను సీసీఎస్ పోలీసులు (CCS Police) పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డు గల ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి (ACP Nagendrachari) ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేశారు. అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్, అమీర్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సదరు ఫ్యాక్టరీలో పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.