4
అక్షరటుడే, బాన్సువాడ: Banswada Police | పట్టణంలోని కల్కి చెరువులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళను పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మహిళ పసిబిడ్డతో శనివారం పట్టణంలోని కల్కిచెరువుకు వచ్చింది. నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేయగా పోలీసులు గమనించి ఆమెను కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో ఏఎస్సై విజయ్, కానిస్టేబుళ్లు ప్రవీణ్, సౌజన్య, నవీన్, అంజయ్య శ్రీనివాస్ ఉన్నారు.