అక్షరటుడే, బాన్సువాడ: Manjeera Rivar | బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామానికి (Budimi Village) చెందిన జంబిక సాయిలు మంజీర నదిలో చిక్కుకున్నాడు. నిజాంసాగర్ (Nizamsagar) 12 వరద గేట్లు ఎత్తడంతో మంజీరా నదిలో చిక్కుకున్నట్లు గ్రామస్థులు గుర్తించి 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు.
కానిస్టేబుల్ పవన్ కుమార్, పృథ్వీ ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. వాగులో చిక్కుకున్న సాయిలను సురక్షితంగా రక్షించగలిగారు. సకాలంలో స్పందించిన కానిస్టేబుళ్లనుఈ సందర్భంగా గ్రామస్థులు అభినందించారు.
కాగా.. సోమవారం రోజే మహమ్మద్ నగర్ మండలం ముగ్దుంపూర్‌కు చెందిన కాపర్లు అస్గర్ పాషా, బండారి సాయినాథ్ సోమవారం వరదనీటిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహం తగ్గించేందుకు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎట్టకేలకు వారిని, గొర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.