HomeతెలంగాణSriramSagar Project | బ్యాక్​వాటర్​లో చిక్కుకున్న పశువుల కాపరిని కాపాడిన పోలీసులు

SriramSagar Project | బ్యాక్​వాటర్​లో చిక్కుకున్న పశువుల కాపరిని కాపాడిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ : SriramSagar Project | శ్రీరాంసాగర్​ బ్యాక్​వాటర్​లో చిక్కుకున్న ఓ పశువుల కాపరిని పోలీసులు అతికష్టంమీద కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంసాగర్​ జలాశయాశానికి వరద నీరు పోటెత్తుతుండడంతో (Sriramsagar Reservoir) గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

కాగా.. ఓ పశువుల కాపరి గేదెలను తీసుకొని శ్రీరాంసాగర్​ బ్యాక్​వాటర్ (Sriramsagar Backwater) ​ ప్రాంతంలోని ఎమ్మెల్యే గెస్ట్​ హౌస్​ ప్రాంతానికి పశువులను మేపడానికి తీసుకువెళ్లాడు. కాగా.. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో వరద నీరు చుట్టుముట్టింది. దీంతో పశువల కాపరి ఆందోళనకు గురయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ శ్రీధర్​రెడ్డి (CI Sridhar Reddy) ఆధ్వర్యంలో వెంటనే బ్యాక్​వాటర్​లో పశువుల కాపరి చిక్కుకున్న ప్రాంతానికి చేరుకుని అతడిని రక్షించారు. అనంతరం గేదెలను కూడా బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్టు నుంచి సాయంత్రం సమయంలో నీటి విడుదలను 5,50,000 క్యూసెక్కుల పెంచడంతో పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి.

Must Read
Related News