అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Muskan | తెలంగాణ పోలీసులు (Telangana Police) ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 7,678 మంది చిన్నారులను రక్షించారు. ఏటా జులై 1 నుంచి 31 వరకు రాష్ట్రంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అంతేగాకుండా వారిని పాఠశాలల్లో చేరుస్తారు. ఈ సారి 7,678 మంది పిల్లలను అధికారులు రెస్క్యూ చేశారు. ఇందులో 7,149 మంది బాలురు, 529 మంది బాలికలు ఉన్నారు.
Operation Muskan | ఇతర రాష్ట్రాల వారు
పోలీసులు రక్షించిన వారిలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh), రాజస్థాన్ (Rajasthan)కు చెందిన 3,783 మంది, నేపాల్ (Nepal)కు చెందిన నలుగురు చిన్నారులు ఉన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 1,713 కేసులు నమోదు చేసిన పోలీసులు 1,718 మంది నిందితులు అరెస్ట్ చేశారు. 6,593 మంది పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించారు.
Operation Muskan | రక్షించిన వారి వివరాలు
బాల కార్మికులుగా పని చేస్తున్న 6,718 మందిని పోలీసులు రక్షించారు. వీధి పిల్లలు 357, భిక్షాటన చేస్తున్న వారు 42, బానిస కార్మికులు ఇద్దరు, ఇతర దోపిడీ ఉద్యోగాలు చేస్తున్న 559 మందిని గుర్తించారు. 1,049 మంది పిల్లలను రెస్క్యూ హోమ్‌లకు తరలించారు. రూ. కనీస వేతన చట్టం కింద బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారికి రూ.47.76 లక్షల జరిమానా వేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను అర్బన్ బ్రిడ్జి పాఠశాలల్లో చేర్పించారు. హైదరాబాద్ నగరంలో 1,247 మంది పిల్లలను పోలీసులు రెస్క్యూ చేశారు.