అక్షరటుడే, బిచ్కుంద : Madnoor | మద్నూర్ మండలంలో ఆదివారం సాయంత్రం భారీగా ఈదురు గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై అడ్డంగా పడ్డ చెట్లను తొలగించేందుకు ఎస్సై (Madnoor SI) విజయ్ కొండ చర్యలు చేపట్టారు. సిబ్బందితో కలిసి రోడ్డుపై పడ్డ చెట్లను ఆయన తొలగించారు. దీంతో తిరిగి వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.
