Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | స్కూటీకి నకిలీ నంబర్​ ప్లేట్​.. కేసు నమోదు చేసిన పోలీసులు

Kamareddy | స్కూటీకి నకిలీ నంబర్​ ప్లేట్​.. కేసు నమోదు చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | పోలీసుల నుంచి జరిమానాలు తప్పించుకునేందుకు ఫేక్ నంబర్ ప్లేట్ బిగించుకున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నరహరి (CI Narahari) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని వినాయక నగర్​కు చెందిన చెరువుపల్లి రాహుల్ రాజ్ అనే వ్యక్తి తన స్కూటీ కొనుగోలు చేశాడు. దానికి రిజిస్ట్రేషన్​ చేసుకున్నాడు.

కామారెడ్డికి చెందిన ఒక వ్యక్తి స్కూటీని కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాహుల్ రాజ్​ స్కూటీ నెంబర్​ ప్లేట్​ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫైన్​లు ఉంటే రాహుల్​ రాజ్​కు పడతాయి. దీంతో ఈ వ్యక్తి తప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో తిరుగుతుండగా పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. నకిలీ నంబర్​ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నా.. నంబర్​ ప్లేట్లు లేకున్నా తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.