Homeజిల్లాలునిజామాబాద్​ACP Raja Venkat Reddy | రూ.17లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

ACP Raja Venkat Reddy | రూ.17లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

నిజామాబాద్​ డివిజన్​ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి తిరిగి బాధితులకు అందజేసినట్లు ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం సెల్​ఫోన్​ రికవరీ మేళా ఏర్పాటు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: ACP Raja Venkat Reddy | నిజామాబాద్​ డివిజన్​ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి తిరిగి బాధితులకు అందజేసినట్లు నిజామాబాద్​ ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి (ACP Raja Venkat Reddy) పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం సెల్​ఫోన్​ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్​లో కొన్ని రోజుల క్రితం పోగొట్టుకున్న, చోరీ చేయబడిన రూ.17 లక్షల విలువైన 170 ఫోన్లను ఇతర రాష్ట్రాల నుంచి సైతం రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే చిన్న లావాదేవీ కూడా జరగట్లేదని.. అలాంటిది విలువైన సమాచారం ఉన్న ఫోన్లతో అజాగ్రత్తగా ఉండవద్దని బాధితులకు ఏసీపీ హితవు పలికారు. బ్యాంక్ అకౌంట్స్ (Bank accounts), పాస్​వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని.. వీటిని పసిగట్టిన నేరగాళ్లు బ్యాంక్​ అకౌంట్లను ఖాళీ చేసేస్తారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా, చోరీ జరిగిన వెంటనే సీఈఐఆర్​ పోర్టల్​లో (CEIR portal) https://www.ceir.gov.in లో ఫిర్యాదు చేయాలని, లేదా సమీప పోలీస్​స్టేషన్​లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

ACP Raja Venkat Reddy | సెకండ్​ హ్యాండ్​ ఫోన్లు..

ముఖ్యంగా సెకండ్​ హ్యాండ్​ ఫోన్లు కొనుగోలు చేస్తే సంబంధిత షాప్​ యజమాని నుంచి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. సెల్​ఫోన్​ దొంగలు మొబైళ్లను చోరీ చేసి వాటిని తక్కువ ధరకు మొబైల్​షాప్​లలో విక్రయిస్తున్నారని ఏసీపీ పేర్కొన్నారు. తక్కువ ధరకు వస్తుందని సెకండ్​ హ్యాండ్​ ఫోన్లను ఎప్పుడూ కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Must Read
Related News