Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP Rajesh Chandra | 130 సెల్​ఫోన్ల రికవరీ

Kamareddy SP Rajesh Chandra | 130 సెల్​ఫోన్ల రికవరీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న 130 ఫోన్లను స్పెషల్ డ్రైవ్(Special drive) ద్వారా రికవరీ చేశామని ఎస్పీ రాజేష్​ చంద్ర(SP Rajesh Chandra) తెలిపారు. బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ ఫోన్లను పొందవచ్చని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక రికవరీ టీం ఉందని.. మూడురోజుల్లోనే 130 ఫోన్లను రికవరీ చేశామని వివరించారు. టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. ఎవరైనా బాధితులు తమ సెల్​ఫోన్లు పోతే వెంటనే స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక పోర్టల్​(Special Portal) ద్వారా వాటిని ట్రేస్​ చేస్తామని ఆయన చెప్పారు.