అక్షరటుడే, కామారెడ్డి: Banswada mandal | జిల్లాలో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోలీసులు దాడులు చేస్తున్నా పేకాట ఆడటం ఆగడం లేదు. గురువారం జిల్లాలో బాన్సువాడ, దోమకొండ మండలాల్లో (Domakonda mandal) పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు.
బాన్సువాడ మండలంలో పోలీసుల దాడుల్లో (police raids) ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.13,300 నగదు, 5 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు దోమకొండ మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేయగా రూ.1800 నగదు 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.