అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Team | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) గంజాయి దందా జోరుగా సాగుతోంది. పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్, గంజాయి దందా ఆగడం లేదు.
హైదరాబాద్ నగరంలో గంజాయి, డ్రగ్స్ దందా ఆరికట్టడానిక ప్రభుత్వం ఈగల్ టీం (Eagle Team) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీసులు ఇటీవల హెచ్ న్యూ విభాగాన్ని సైతం బలోపేతం చేశారు. అయినా గంజాయి దందా ఆగడం లేదు. కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కులు ఆగడం లేదు. గంజాయికి బానిసలుగా మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి బానిసలుగా మారుతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేపట్టారు. తాజాగా నలుగురు డ్రగ్స్ ప్లెడ్లర్లను అరెస్ట్ చేశారు.
Eagle Team | నలుగురి అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లిలో గంజాయి పెడ్లర్లపై ఈగల్ టీం, పోలీసులు (Eagle Team and police) దాడులు చేశారు. నలుగురు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు. పృథ్వీరాజ్, రాహుల్, అక్రం, షఫీ అనే వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పృథ్వీరాజ్ హైదరాబాద్ చెంగిచెర్ల నివాసిగా గుర్తించారు. కోవిడ్ (COVID-19) తర్వాత ఉపాధి కోల్పోయిన పృథ్వీరాజ్ గంజాయి వ్యాపారంలోకి దిగాడు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
Eagle Team | నిత్యం కేసులు
హైదరాబాద్ నగరంలో ఈగల్ టీమ్, ఎస్వోటీ పోలీసులు, నార్కోటిక్స్ విభాగం, హెచ్‌న్యూ పోలీసులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. డ్రగ్స్‌పై సీపీ సజ్జనార్ సైతం సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.