అక్షరటుడే, లింగంపేట: Lingampet | కామారెడ్డి జిల్లాలోని దాబాల్లో యథేచ్ఛగా మద్యం సిట్టింగ్లు కొనసాగుతున్నాయి. తరచుగా పోలీసులు దాడులు చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు. ఇటీవల నిజాంసాగర్, ఎల్లరెడ్డి మండల్లాలోని పలు దాబాల్లో మద్యం సిట్టింగ్లు నిర్వహిస్తుండడంతో పోలీసులు దాడులు చేశారు. పలువురు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాగా.. తాజాగా లింగంపేట మండల కేంద్రంలోని ఓ దాబాలో అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. అనంతరం దాబా యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై దీపక్ కుమార్ (SI Deepak Kumar) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాబాలో మద్యం సేవించినా.. అమ్మినా కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
Lingampet | పేకాట స్థావరంపై దాడి
లింగం మండలం సజ్జన్పల్లి (Sajjan pally) గ్రామంలో ఆదివారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. గ్రామంలో పేకాడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. దాడుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3,220ల నగదు, నాలుగు సెల్ఫోన్లను, నాలుగు బైక్లను జప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.