HomeUncategorizedPolice Raids | హాస్టళ్లలో పోలీసులు దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం

Police Raids | హాస్టళ్లలో పోలీసులు దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police Raids | కాలేజీ విద్యార్థుల హాస్టళ్లు, రూమ్​ల్లో పోలీసులు మెరుపు దాడులు చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. పుస్తకాలు ఉండాల్సిన గదుల్లో గంజాయి, డ్రగ్స్​, ఆయుధాలు ఉండటంతో పోలీసులు షాక్​ అయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్​లో పోలీసులు(Coimbatore Police) ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

కోయంబత్తూరు జిల్లా గ్రామీణ పోలీసులు ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేశారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల హాస్టళ్లు, రూముల్లో తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ క్లీన్ కోవై(Operation Clean Kovai) పేరుతో 412 మంది సిబ్బంది 91 బృందాలుగా ఏర్పడి తనిఖీల్లో పాల్గొన్నాయి.

Police Raids | 68 మంది అరెస్ట్​

పోలీసులు సోదాల్లో భారీగా డ్రగ్స్‌, గంజాయి బయట పడ్డాయి. విద్యార్థుల హాస్టళ్లలో ఆయుధాలు పోలీసులు గుర్తించారు. 7 కేజీల గంజాయి, గుట్కా, ఇతర నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుడాన్​ దేశస్తుడితో పాటు 12 మందిని అరెస్టు చేశారు. 8 ఆయుధాలు(8 Weapons), 52 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సూడాన్(Sudan)​కు చెందిన ఓ వ్యక్తి కోయంబత్తూరులోని ఒక కాలేజీలో డిగ్రీ చదివాడు. బ్యాక్​లాగ్​లు ఉండటంతో ఇక్కడే ఉంటున్న అతను డ్రగ్స్​ అమ్మడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులతో పాటు వలస కార్మికుల నివాసాల్లోనూ పోలీసులు దాడులు(Police Raids)చేపట్టారు.

Police Raids | ఆందోళన కలిగిస్తున్న డ్రగ్స్​

దేశవ్యాప్తంగా డ్రగ్స్​ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​కు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారని తల్లిదండ్రులు కలలు కంటుండగా.. పిల్లలు హాస్టళ్లలో ఉండి వ్యసనాలకు అలవాటు పడి వారి మానసిక క్షోభను మిగులుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​లో సైతం పలువురు మెడికల్ కాలేజీ విద్యార్థులు డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు డి అడిక్షన్​ సెంటర్​కు తరలించారు. విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇది దేశానికి మంచిది కాదని, డ్రగ్స్​పై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.