అక్షరటుడే, ఎల్లారెడ్డి: Raids on dhabas | కామారెడ్డి జిల్లాలో పలు దాబాల్లో యథేచ్ఛగా మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఆగడం లేదు. పోలీసులు తరచూ తనిఖీలు చేపడుతున్నా.. దందా ఆగడం లేదు. తాజాగా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో మండలంలోని పలు దాబాలపై దాడులు నిర్వహించారు. లక్ష్మాపూర్‌లోని శ్రీ మాతా దాబా హోటల్‌తో పాటు ఎల్లారెడ్డిలోని అన్నపూర్ణ ఫ్యామిలీ దాబాలపై పోలీస్ బృందం ప్రత్యేక రైడ్ నిర్వహించింది. అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, ఇద్దరు దాబా యజమానులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
Raids on dhabas | గతంలోనూ దాడులు
జాతీయ రహదారి 161పై (National Highway 161) ఉన్న దాబాలపై గతనెల సైతం పోలీసులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో పలు దాబాల్లో దాడులు చేపట్టారు. ఏకంగా ఆరు దాబాల్లో (dhabas) అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తరచూ దాబాలపై దాడులు చేస్తున్నా.. మద్యం సిట్టింగ్‌లకు అడ్డుకట్ట పడడంలేదు.