అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Bengaluru | టెక్ సిటీగా పేరొందిన బెంగళూరులో పోలీసులు రేవ్ పార్టీ జరగడం కలకలం రేపింది. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకాలో జరుగుతున్న రేవ్ పార్టీ(Rave party)ని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువతులు సహా 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొకైన్(Cocaine), హషీష్(hashish,), హైడ్రో గంజాయి(hydro cannabis) వంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
కన్నమంగళ గేట్ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ (Rave party bangalore) జరుగుతుందని సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు దేవనహళ్లి పోలీసులు (Devanahalli police) దాడి చేశారు.
పార్టీలో పాల్గొన్న మొత్తం 31 మంది యువతీ యువకులను అరెస్టు చేశారు. వీరంతా ఐటీ ఉద్యోగులుగా గుర్తించారు. వీరిలో చైనా దేశానికి చెందిన ఓ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. బర్త్‌డే వేడుకల సందర్భంగా ఈ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు(Police) తెలిపారు. నిందితుల నుంచి శాంపిల్స్ సేకరించి, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపారు.