అక్షరటుడే,బోధన్: Panchayat Elections | గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Sai chaitanaya ) పేర్కొన్నారు. సాలూర మండల కేంద్రంలో మొదటి విడత పోలింగ్ గురువారం జరుగనున్న నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Panchayat Elections | విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ (Election Commission) నియమనిబంధనలకు అనుగుణంగా ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా వారి ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు.
Panchayat Elections | గట్టి బందోబస్తు..
సాలూర మండలంలోని ఎన్నికల కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని సీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మండలంలోని గ్రామాలకు మొత్తం 100 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం ఏర్పాటు చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas) వెల్లడించారు. ప్రజలు, ఓటర్లు పోలీస్ శాఖకు సహకరించి ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ధైర్యంగా ఉండి వారి ఓటుహక్కును వినియోగించుకోవాల్సిందిగా మండల ఓటర్లను సీపీ కోరారు.
Panchayat Elections | అందుబాటులో పోలీస్ సిబ్బంది..
పోలీస్ శాఖ ప్రజల బాగోగులు, శాంతి భద్రతల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రూరల్ ఎస్సై మచ్చేందర్, ఎలక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.