115
అక్షరటుడే, గాంధారి: Gandhari | గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) నేపథ్యంలో శుక్రవారం గాంధారి మండల కేంద్రంలో పోలీసు కవాతు నిర్వహించారు. రూరల్ సీఐ సంతోష్ కుమార్ (Rural CI Santosh Kumar), స్థానిక ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు కవాతు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక బలగాలను మోహరించడం జరిగిందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.