అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి (terror attack) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో బాన్సువాడ పట్టణంలో (Banswada town) పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్టాండ్‌లో మంగళవారం రాత్రి సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ప్రయాణికుల లగేజీలు, వాహనాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
