అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: DGP Shivadhar Reddy | జిల్లా పౌరుల భద్రతే లక్ష్యంగా నిజామాబా సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా మెడికల్ కళాశాల (Medical college) వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిల్ ఛైర్మన్‌గా సీపీసాయి చైతన్య, కన్వీనర్‌గా అదనపు డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రటరీగా కవితా రెడ్డితో పాటు ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీపీ, ఐజీ, సీపీ పాల్గొని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ కంఠేశ్వర్‌లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ (Nizamabad Rural Police Station) భవనం, మాక్లూర్ పోలీస్ స్టేషన్ (Makloor Police Station) భవనాలను ఆయన ప్రారంభించారు.
DGP Shivadhar Reddy | నేరరహిత సమాజం
డీజీపీ మాట్లాడుతూ నేర రహిత సమాజం సీసీ కెమెరాల నిఘా, క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని డీజీపీ తెలిపారు. నూతన భవనాల్లో సిబ్బందికి మెరుగైన పని వాతావరణం లభిస్తుందని, ఇది వారి పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ విషయంలో ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యపర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఐజీ మల్టీజోన్–1 చంద్రశేఖర్, సీపీ సాయి చైతన్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
DGP Shivadhar Reddy | శాంతిభద్రతల పరిరక్షణలో..
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అమోఘమన్నారు. ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకే అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునీకరణకు కట్టుబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి భరోసా ఇచ్చేలా సిబ్బంది ప్రవర్తించాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని, శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు.
DGP Shivadhar Reddy | పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ ప్రాధాన్యత..
ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, కంఠేశ్వర్ ప్రాంత ప్రజలకు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులోకి రావడంపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.