Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | 21 నుంచి పోలీస్ అమరుల వారోత్సవ పోటీలు : ఎస్పీ రాజేష్...

Kamareddy SP | 21 నుంచి పోలీస్ అమరుల వారోత్సవ పోటీలు : ఎస్పీ రాజేష్ చంద్ర

పోలీసు అమరల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, పోలీసు సిబ్బంది పోటీలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్​చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పోలీస్ అమరుల వారోత్సవాల సందర్భంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈనెల 21 నుంచి 31 వరకు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో (police stations) పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ ప్రజల భద్రతకు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష సేవలు అందించారన్నారు. వారి త్యాగల ఫలితమే నేటి మన శాంతియుత భద్రతతో కూడిన సమాజమని తెలిపారు.

Kamareddy SP | విద్యార్థులకు పోటీలు..

ఈ సందర్భంగా జిల్లాలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 28 వరకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర-విద్యార్థులు డ్రగ్స్‌ నుండి ఎలా దూరంగా ఉండాలి అనే అంశంపై వ్యాసరచన పోటీలు (Essay writing competitions) నిర్వహిస్తున్నామన్నారు.

పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులు https://forms.gle/jaWLdt2yhNrMpe3eA లో లాగిన్ అయి పేరు, విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయాలన్నారు. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని ఫొటో లేదా పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాలన్నారు. వ్యాస రచనలో గరిష్టంగా 500 పదాలు మాత్రమే ఉండాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులను జిల్లా పోలీస్ కార్యాలయంలో (district police office) బహుమతులతో సత్కరించి, రాష్ట్రస్థాయికి ఎంపిక చేయబడతారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని సూచించారు.

Kamareddy SP | ఫొటో అండ్​ షార్ట్​ఫిలిం పోటీలు..

అలాగే ఫొటో అండ్ షార్ట్ ఫిలిం పోటీలు (photo and short film competitions) కూడా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. విద్యార్థులు, ఇందులో యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొనవచ్చన్నారు. పోలీసులు చేసిన సేవలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాల నివారణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల సేవ వంటి అంశాలపై మూడునిమిషాల లోపు ఉన్న షార్ట్ ఫిల్మ్‌లు లేదా సమాజంలో పోలీసుల ప్రతిష్ఠను పెంపొందించే ఫొటోలు రూపొందించి అక్టోబర్ 23 తేదీలోపు కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫొటోలు (ప్రింట్ లేదా డిజిటల్), షార్ట్ ఫిల్మ్‌లు (పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలన్నారు.

జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన మూడు ఉత్తమ ఎంట్రీలకు బహుమతులు ప్రదానం చేయబడతాయని, వీరిలో ఉత్తములను రాష్ట్రస్థాయి పోటీలకు (state-level competitions) పంపించబడుతుందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల వీరత్వాన్ని స్మరించుకునే ఉద్దేశంతో పోలీస్ కళా బృందం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయిన్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని, పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళులర్పించాలని ఎస్పీ కోరారు.

Kamareddy SP | పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల వివరాలు

  • ఈనెల 20 న బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు
  • 21న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉదయం 8 గంటలకు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం
  • 22న కామారెడ్డి, 24 న ఎల్లారెడ్డి, 25 న బాన్సువాడ డివిజన్లలో అమరవీరుల కుటుంబాలకు పరామర్శ
  • 25న సైకిల్ ర్యాలీ
  • 27న కామారెడ్డి, 28న ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌లలో ప్రజా అవసరాల సేకరణ
  • 29న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం
  • 30న ఓపెన్ హౌస్ కార్యక్రమం
  • 31న క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.