Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | పోలీస్ ఉద్యోగం బాధ్యతతో కూడుకున్నది: ఎస్పీ రాజేష్​ చంద్ర

Kamareddy SP | పోలీస్ ఉద్యోగం బాధ్యతతో కూడుకున్నది: ఎస్పీ రాజేష్​ చంద్ర

పోలీసు ఉద్యోగం బాధ్యతతో కూడుకున్నదని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి రూరల్​ పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పోలీస్ ఉద్యోగం బాధ్యత, సేవతో కూడుకున్నదని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్​ను (Kamreddy Rural Police Station) బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా సర్కిల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త రికార్డు రూంను ప్రారంభించి పరిశీలించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, దర్యాప్తులో ఉన్న గ్రేవ్ కేసుల ప్రగతిని సమీక్షించారు. ఎలాంటి కేసులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలనిన్నారు. నేరాలు జరిగిన ప్రాంతాలను సర్కిల్ మ్యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Kamareddy SP | శాంతిభద్రతల పరిరక్షణలో..

ఎస్పీ రాజేష్​ చంద్ర మాట్లాడుతూ.. ప్రతి పోలీసు అధికారి తన పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరాన్ని బట్టి టెక్నికల్ సపోర్ట్ వినియోగించుకోవాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచూ సందర్శించి కేసుల పురోగతిని సమీక్షిస్తూ ఎస్​హెచ్​వోలకు మార్గదర్శకాలు ఇవ్వాలని తెలిపారు.

Kamareddy SP | సర్కిల్​ పరిధిలోని..

సర్కిల్ పరిధిలోని కేడీ, సస్పెక్ట్, రౌడీ షీటర్లు కదలికలను క్రమం తప్పకుండా పరిశీలించి, వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాలు చోటుచేసుకునే ప్రాంతాలను క్రైం హాట్ స్పాట్స్​గా గుర్తించి నిఘా బలపర్చాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు వంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రామన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.