అక్షరటుడే, వెబ్‌డెస్క్ : miss world competition | తెలంగాణ telangana ప్రభుత్వం హైదరాబాద్ hyderabad వేదికగా మిస్ వరల్డ్ miss world పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కు వివిధ దేశాల యువతులు, ప్రతినిధులు తరలి రానున్నారు. దీంతో హైదరాబాద్‌లో భద్రతను security పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఈ నెల 7 నంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు సాగనున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లపై drones నిషేధం విధించారు.
miss world competition | విదేశి ప్రతినిధులు ఉండే ఏరియాల్లో..
విదేశాలకు చెందిన ప్రతినిధులు బస చేసే హోటళ్లు, పోటీలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరేయొద్దని సైబరాబాద్ cyberabad cp కమిషనర్ అవినాష్ మహంతి గురువారం ఆదేశాలు జారీ చేశారు. మే 4 నుంచి జూన్ 2వ తేదీ వరకు సైబరాబాద్ పరిధిలోని హైటెక్స్ మాదాపూర్, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు శంషాబాద్, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం(Gachibowli Indoor Stadium), చిలుకూరు ఎకో పార్కు(Chilkur Eco Park), టీ హబ్, శిల్పారామం, శిల్ప కళావేదిక, హైటెక్ సిటీ, ట్రైడెంట్ హోటల్ ప్రాంతాల్లో రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్‌తో పాటు మైక్రోలైట్ ఎయిర్ క్రాప్ట్స్‌లు, పారా గ్లైడర్స్ ఎగుర వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పైన సూచించిన ప్రాంతాలకు వంద మీటర్ల పరిధిలో ఎక్కడ కూడా డ్రోన్లు వినియోగించొద్దన్నారు.