అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch elections) భాగంగా మూడో విడత పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు మంగళవారం ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (Armoor SHO Satyanarayana Goud) ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలంలోని పిప్రి, మంథని గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ (flag march) జరిగింది.
Armoor Police | నిర్భయంగా ఓటు వేయాలి..
ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో మాట్లడుతూ..ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటువేయాలని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ఎవరైనా పోలింగ్‌కు ఇబ్బందులు కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్‌మార్చ్‌లో స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.