77
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Police flag march | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శాంతి భద్రతే లక్ష్యంగా పోలీస్ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా, స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజరెడ్డి, ఎస్సైలు మహేష్ , సుబ్రహ్మణ్యం, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.