అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal | మంత్రి భర్తకు పోలీసులు ఎస్కార్ట్గా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. వరంగల్ తూర్పు (Warangal East) నియోజకవర్గంలోని పలు డివిజన్లలో సీసీ రోడ్ల పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) భర్త కొండా మురళి(Konda Murali) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాహనానికి పోలీసులు ఎస్కార్ట్గా వెళ్లారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తికి పోలీసులు ఎస్కార్ట్గా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.