అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police | అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు (Traffic police) చర్యలకు ఉపక్రమించారు. నగరంలో శబ్ద కాలుష్యానికి (noise pollution) కారణమవుతున్న బైక్ల సైలెన్సర్లను తొలగించి రైలేస్టేషన్ ఎదురుగా ధ్వంసం చేశారు.
Nizamabad Police | శబ్దకాలుష్యం చేస్తే ఉపేక్షించేది లేదు..
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswareddy) మాట్లాడుతూ.. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు నగరంలో శబ్దకాలుష్యం చేస్తున్న 350కు పైగా బైక్లను సీజ్ చేశామన్నారు. అనంతరం సైలెన్సర్లను తొలగించి రోడ్రోలల్తో ధ్వంసం చేశామని వివరించారు. ఇప్పటి నుంచి వాహనాలకు శబ్దం కలిగించే సైలెన్సర్లు బిగిస్తున్న మెకానిక్లపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
Nizamabad Police | ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు..
సైలెన్సర్ల భారీ శబ్దం కారణంగా ఎంతో మంది హృదయ సంబంధిత రోగాలకు గురవుతున్నారని బస్వారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఖలీల్వాడి ప్రాంతంలో అధికంగా ఆస్పత్రులు ఉన్నాయని.. ఆయా ప్రాంతంలో సైలెన్సర్లు శబ్దం చేస్తే చిన్నారులు, హృద్రోగులు (children and heart patients) ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. శబ్దకాలుష్యం చేస్తున్న బైక్లను ముందుగా సీజ్ చేస్తామని.. ఫైన్ కట్టాకే రిలీజ్చేస్తామని.. మళ్లీ అదేపనిగా సౌండ్ పొల్యూషన్ చేస్తే కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతామని సూచించారు.
Nizamabad Police | హెల్మెట్లపై స్పెషల్ డ్రైవ్..
నగరంలో హెల్మెట్ (helmets) ధరించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అదనపు ఏసీపీ పేర్కొన్నారు. ఇప్పటి నుంచి హెల్మెట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. తప్పనిసరిగా వాహనదారులు హెల్మెట్లు ధరించాలని సూచించారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో కేంద్ర మోటార్ వెహికల్ సవరణ చట్టం ప్రకారం ఫైన్లు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
