More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్​శాఖకు రావాల్సిన పెండింగ్​ బిల్లులను వెంటనే మంజూరయ్యేలా చూడాలని జిల్లా పోలీస్​ శాఖ ఆఫీసర్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు కోరారు.

    ప్రజాపాలన దినోత్సవం (Prajapalana Dinotsavam) సందర్భంగా జిల్లాకు ముఖ్య​అతిథిగా విచ్చేసిన సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డికి (Vem Narender Reddy) ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) ఆధ్వర్యంలో అసోసియేషన్​ తరపున వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు షకీల్​ పాషా మాట్లాడుతూ.. ఎస్​ఎల్​ఎస్​, అడిషనల్​ ఎస్​ఎల్​ఎస్​లు, జీపీఎఫ్​లు, 2018 పీఆర్సీ బకాయిలు, 2023 టీఏలు పెండింగ్​లో ఉన్నాయని.. వాటిని విడుదల చేయాలని కోరారు. 2018 పీఆర్సీ బకాయిలు మాత్రం రాష్ట్రంలో ప్రతి శాఖకు అందజేశారని పోలీస్​శాఖకు మాత్రం రాలేదన్నారు.

    ఈ ఏడాదిలో విద్యాసంవత్సరం ప్రారంభమై చాలా రోజులైనా ఫీజులు కట్టడంలో పోలీసు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తెలుగువారికి పెద్ద పండుగైన దసరా ముందైనా పెండింగ్​ బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు.

    More like this

    Arogya Sri | నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు.. ఉమ్మడి జిల్లాలో 28 ఆస్పత్రుల్లో చికిత్సలు బంద్​

    అక్షరటుడే, కామారెడ్డి : Arogya Sri | రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు (Arogya Sri services) నిలిచిపోయాయి....

    Banswada | బైక్, డీసీఎం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బైక్​ను డీసీఎం ఢీకొనగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన నస్రుల్లాబాద్​లోని (Nasrullabad) నిజాంసాగర్​...

    Vishwakarma Jayanti | ఘనంగా విశ్వకర్మ జయంతి

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Vishwakarma Jayanti | అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర జయంతిని...