అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్ పోలీసులు పోకిరీల ఆట కట్టిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగరంలో రాత్రి పూట ప్రత్యేక డ్రైవ్ (special night-time drive) చేపడుతున్నారు.
నగరంలో ఇటీవల కొందరు అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారు. రోడ్లపై హంగామా చేస్తున్నారు. గంజాయి, హుక్కాతాగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొద్ది రోజులుగా నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఏ కారణం లేకుండా రాత్రిపూట బయట తిరుగుతున్న వారి పని పడుతున్నారు. అనవసరంగా బయట ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరోసారి కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల గ్యాంగ్వార్లు (gang wars), చోరీలు, ఇతర నేరాలు పెరగడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
Hyderabad Police | బయటకు రావద్దు
హైదరాబాద్‌లో బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ (Balapur Inspector Sudhakar) ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో శనివారం అర్ధరాత్రి ప్రత్యేక క్రాక్‌డౌన్ డ్రైవ్ చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని ఇన్స్పెక్టర్ సుధాకర్ సూచించారు.