అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Chain snatching | నగరంలో చైన్ స్నాచింగ్ (chain snatching) కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ (CCS Inspector Suresh) వివరాలు వెల్లడించారు.
Chain snatching | సుభాష్‌నగర్‌లో..
నగరంలోని సుభాష్‌నగర్‌లో ఇటీవల జరిగిన చైన్‌స్నాచింగ్‌కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల (CCTV footage) ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో పదిరోజులుగా సీసీఎస్, మూడో టౌన్ సిబ్బంది నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు నిందితులు షేక్ మహమ్మద్ కైఫ్, అద్నాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు కూడా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందినవారుగా గుర్తించారు.
Chain snatching | సులభంగా డబ్బు సంపాదించాలని..
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. విచారణలో వృద్ధ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసినట్లు వారు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు అమన్ పటేల్ పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.