ePaper
More
    HomeతెలంగాణConstable Suspension | పోలీస్​ కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు

    Constable Suspension | పోలీస్​ కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​అర్బన్​: Constable Suspension | వడ్డీ వ్యాపారుల విషయంలో నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ ప్రత్యేకించి పోలీసులు వడ్డీ దందాలు నిర్వహిస్తే ఏమాత్రం సహించడం లేదు. ప్రత్యేకంగా క్రిమినల్​ కేసులు నమోదు చేయించడమే కాకుండా సస్పెండ్​ చేస్తున్నారు.

    ఈ క్రమంలో కమిషనరేట్​లో మరో కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. మెండోరా పోలీస్​ స్టేషన్​లో (Mendora Police Station) విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్​ గంగాధర్​ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​లో (Nizamabad Rural Police Station) రెండు కేసులు నమోదయ్యాయి. అనంతరం విచారణ చేపట్టారు. నివేదిక అందిన తదుపరి తాజాగా సీపీ చర్యలు తీసుకున్నారు. సదరు కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

    కాగా.. గడిచిన రెండు నెలల వ్యవధిలో కమిషనరేట్​ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్​ వేటు పడింది. వీరిలో ఇద్దరు వడ్డీ వ్యాపారం నిర్వహించే వారు కాగా.. ఒకరు ఉద్యోగాల పేరిట డబ్బుల వసూలుకు పాల్పడినట్లు తెలుస్తోంది.

    More like this

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....