- Advertisement -
HomeతెలంగాణFalaknuma Express | రైలులో ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్​.. తనిఖీలు చేపట్టిన పోలీసులు

Falaknuma Express | రైలులో ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్​.. తనిఖీలు చేపట్టిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Falaknuma Express | తెలంగాణలోని ఘట్​కేసర్ (Ghatkesar)​ రైల్వే స్టేషన్​లో కలకలం రేగింది. ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

హౌరా నుంచి సికింద్రాబాద్ (Secunderabad) వస్తున్న ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్​కేసర్​ రైల్వే స్టేషన్ (Railway Station)​లో అధికారులు ట్రెయిన్​ను నిలిపి వేసి తనిఖీలు చేపడుతున్నారు. ఆర్పీఎఫ్​, జీఆర్పీ, ఘట్​కేసర్​ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సుమారుగా గంట నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

కాగా రైలులో నిజంగానే ఉగ్రవాదులు ఉన్నారా.. లేక కావాలని ఎవరైన నకిలీ ఫోన్​కాల్​ చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల దేశంలో ఉగ్రలింకులు బయట పడుతున్న తరుణంలో ట్రెయిన్​లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. జార్ఖంఢ్​లో కొన్ని రోజుల క్రితం ఉగ్రవాది అజార్​ డానిష్​ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఐసీస్​ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రైలులో టెర్రరిస్టులు ఉన్నారనే వార్తలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News