Police Community Contact Program | గౌతమ్ నగర్ డివిజన్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
Police Community Contact Program | గౌతమ్ నగర్ డివిజన్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Community Contact Program : నగరంలోని గౌతమ్ నగర్ డివిజన్ లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. బుధవారం సాయంత్రం ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో త్రీ టౌన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో దాదాపు 100 మంది పోలీసులు పది టీములుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. దొంగతనాల నివారణ, మాదకద్రవ్యాలు, నేరాల నివారణ కార్యక్రమాలలో భాగంగా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గౌతమ్ నగర్ డివిజన్ లో ప్రతి గల్లీలో సోదాలు నిర్వహించారు.

అనుమానితులను, రౌడీషీట్లను చెక్ చేశారు. సీఐలు శ్రీనివాస్ రాజ్, రఘుపతి, సురేష్, మల్లేష్, భిక్షపతి, శ్రీలత, త్రీ టౌన్ ఎస్సై హరిబాబు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.