Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | 21వ తేదీ నుంచి పోలీస్​ సంస్మరణ వారోత్సవాలు: సీపీ సాయిచైతన్య

Nizamabad CP | 21వ తేదీ నుంచి పోలీస్​ సంస్మరణ వారోత్సవాలు: సీపీ సాయిచైతన్య

జిల్లాలో పోలీస్ సంస్మరణ వారోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | జిల్లాలో పోలీస్​ సంస్మరణ వారోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని.. వారి త్యాగం వల్లే నేడు సమాజంంలో శాంతియుత వాతావరణం నెలకొందని సీపీ పేర్కొన్నారు.

వారి త్యాగాలను గుర్తుచేస్తూ డీజీపీ ఆదేశాల మేరకు ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ (Armoor and Bodhan) డివిజన్లలో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 20న జనరద్దీ గల ప్రదేశాల్లో, ఆర్టీసీ బస్టాండ్లలో (RTC bus stands), రైల్వేస్టేషన్లలో బ్యానర్లు, హోర్డింగ్​లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. 21న జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో అమరవీరుల దినోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. 22న అమరవీరుల కుటుంబాలను నిజామాబాద్ డివిజన్​లో పరామర్శించనున్నట్లు వివరించారు.

Nizamabad CP | వివిధ రకాల పోటీలు..

వారోత్సవాల్లో భాగంగా ఈనెల 23న విద్యార్థులకు ‘డ్రగ్స్ నిర్వహణ నివారణలో పోలీసుల పాత్ర.. విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండాలి’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు తెలుగు, ఇంగ్లిష్​, ఉర్దూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మూడు నిమిషాల నిడివితో షార్ట్ ఫిలిం (short film) కాంపిటేషన్, ఫొటోగ్రఫీ పోటీ ఉండనుంది. 24న ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో అమరవీరుల కుటుంబాలను పరమర్శించడం జరుగుతుంది.

25న సైకిల్ ర్యాలీ, బైక్​ ర్యాలీ (డిచ్​పల్లి నుంచి పోలీస్ హెడ్​క్వార్టర్స్ వరకు) నిర్వహిస్తారు. ‘పని ప్రదేశంలో లింగ వివక్షత’ అనే అంశంపై 26న వ్యాస రచన పోటీలు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో ) నిర్వహిస్తారు. ఈ పోటీకి సంబంధించి క్యాటగిరీ–1లో కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ‘క్షేత్రస్థాయిలో పోలీస్​ వ్యవస్థను బలోపేతం చేయడం’ అనే అంశంపై పోటీలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి క్యాటగిరీ–2లో ఎస్సై నుంచి ఆపైస్థాయి వరకు ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాలి.

27న నిజామాబాద్ డివిజన్లలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను తెలుసుకునే కార్యక్రమం నిర్వహించనున్నారు. 28న ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని కొన్ని కాలనీల్లో.. కొన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే అంశాలపై సమావేశాలు ఉండనున్నాయి. 29న పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో రక్తదాన శిబిరం (blood donation camp) ఉంటుంది. 30న ఆన్​లైన్​ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాల నిర్వహణ, 31న గాంధీ చౌక్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు క్యాండిల్​ ర్యాలీ చేపట్టనున్నారు.