HomeUncategorizedTamil Nadu | ఆర్టీసీ దెబ్బకు పోలీసుల తిక్క కుదిరింది.. ఏ విషయంలోనంటే..!

Tamil Nadu | ఆర్టీసీ దెబ్బకు పోలీసుల తిక్క కుదిరింది.. ఏ విషయంలోనంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : Tamil Nadu | రాంగ్‌రూట్‌ డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. సాధారణ పౌరులు చట్టాన్ని అతిక్రమించి తప్పులు చేస్తుంటారు. మరి, చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన పోలీసులే దానిని అతిక్రమిస్తే.. తమిళనాడు(Tamil Nadu)లో అదే జరిగింది. రాంగ్​రూట్​లో డ్రైవింగ్​ చేస్తూ ఏకంగా అక్కడి ఆర్టీసీ బస్సును(RTC Bus) ఢీకొన్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది.

సదరు వీడియోలో ట్రాఫిక్ పోలీసులే (Traffic Police) రాంగ్‌రూట్‌లో మహీంద్రా బొలెరోలో దూసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తప్పు అని తెలిసి కూడా రాంగ్​రూట్​ వన్-వేలో వేగంగా దూసుకెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. అధికారం తమ చేతుల్లోనే ఉందనే పొగరుబోతు తనంతో వ్యవహరించి అడ్డంగా బుక్కయ్యారు. బస్సును ఢీకొని తమ వాహనాన్ని చేజేతులారా దెబ్బతీసుకోవడమే కాకుండా, అందరి దృష్టిలో అల్లరిపాలయ్యారు.

ఈ ఘటన చెన్నైకి ఉత్తరాన, తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రహదారిలో జరిగినట్లు భావిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియోలో.. ఎదురుగా వాహనాలు వస్తున్నా లెక్కచేయకుండా బొలెరో బస్సును ఢీకొట్టే వరకు వేగంగా వెళుతూనే ఉంది.

TNRTC బస్సు డ్రైవర్​ తప్పు అయితే ఇందులో ఏమాత్రం కనబడటం లేదు. బొలెరో డ్రైవరే(Bolero driver) నిర్లక్ష్యంగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతూ నడిపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సర్వీసు రోడ్డులో వెళ్తున్న ఒకరు తన సెల్‌ఫోన్లో రికార్డు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌ అవుతోంది. దీంతో పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిన వారే తప్పుడు దారిలో వెళ్తే ఎలా? అని నిలదీస్తున్నారు.

https://www.instagram.com/reel/DKH31Dpz97y/?utm_source=ig_web_copy_link