Homeక్రైంHyderabad | స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

Hyderabad | స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో స్పా (spa) ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

నగరంలోని అమీర్​పేట (Ameerpet)లో ఎన్ఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా పేరుతో హైటెక్​ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్​జోన్​ టాస్క్​ఫోర్స్​, ఎస్​ఆర్​ నగర్ (SR nagar)​ పోలీసులు స్పాపై దాడి చేశారు. హైటెక్​ వ్యభిచారం నిర్వహిస్తున్న రాకెట్​ను ఛేదించారు.

స్పా సబ్​ ఆర్గనైజర్​తో పాటు ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళను రక్షించారు. ఇంకా ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్​ చేసిన వారి నుంచి రూ.8,500 నగదు, తొమ్మిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.