అక్షరటుడే, ఇందూరు: railway station | చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు లాడ్జ్‌లు Lodges అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా వ్యభిచారానికి హద్దు అదుపు లేకుండా పోతోంది. అమ్మాయిలను ఎర వేస్తున్న నిర్వాహకులు విటులను ఆకర్షిస్తూ.. రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో Nizamabad district headquarters వ్యభిచారం Prostitution కోరలు చాస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది. నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు ఒకటో ఠాణా పోలీసులు రైడ్ చేశారు.
సోమవారం (అక్టోబరు 6) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 20 లాడ్జిల్లో పోలీసులు సోదాలు జరిపారు. నలుగురు ఎస్సైలతోపాటు 25 మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న ఓ లాడ్జిలో ఓ విటుడు, విటురాలిని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
నిందితులను ఠాణాకు తీసుకెళ్లారు. విటుడు మోస్రా మండలం చింతకుంటకు చెందిన మహమ్మద్ అజిజ్గా గుర్తించారు. అతడితోపాటు లాడ్జి మేనేజర్ కుందరం కేడర్ పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.