ePaper
More
    HomeతెలంగాణCyber Fraud | సైబర్​ నేరగాళ్ల ఆట కట్టించిన పోలీసులు.. 25 మంది అరెస్ట్​

    Cyber Fraud | సైబర్​ నేరగాళ్ల ఆట కట్టించిన పోలీసులు.. 25 మంది అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు ఆశ చూపి, భయపెట్టి ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్నారు. అయితే హైదరాబాద్​ పోలీసులు సైబర్​ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. ఆధునిక సాంకేతికను వినియోగించుకొని నిందితులను అరెస్ట్​ చేస్తున్నారు. జూన్​ నెలలో హైదరబాద్ ​ పోలీసులు(Hyderabad Police) దేశవ్యాప్తంగా 25 మంది సైబర్‌ నేరస్తులను అరెస్ట్​ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.

    Cyber Fraud | 453 కేసుల్లో నిందితులు

    హైదరాబాద్​ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్(Special Operation)​ చేపట్టి వివిధ రాష్ట్రాల్లోని 25 మంది సైబర్​ నేరగాళ్లను అరెస్ట్​ చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 453 కేసులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో 66 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో ఏపీ, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక చెందిన వారు ఉన్నారు. వారి నుంచి పోలీసులు రూ.లక్ష నగదు, 20 చెక్ బుక్‌లు, 17 డెబిట్ కార్డులు, 34 ఫోన్లు, 8 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

    READ ALSO  Hyderabad | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

    Cyber Fraud | బాధితులకు రూ.72.85 లక్షలు రిఫండ్​

    తెలంగాణ పోలీసులు(Telangana Police) జూన్​ నెలలో నమోదైన సైబర్​ కేసుల్లో బాధితులకు రూ.72.85 లక్షలు రీఫండ్ చేయించారు. ఈ కేసుల్లో మొత్తం రూ.2.59 కోట్లను సైబర్​ నేరగాళ్లు(Cyber ​​Criminals) కాజేశారు. అయితే అధికారులు రూ.72.85 లక్షలను మాత్రమే రికవరీ చేయగలిగారు. నకిలీ ట్రేడింగ్ యాప్, పార్ట్​ టైం జాబ్​, వర్క్​ ఫ్రం హోమ్​ పేరిట సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. అలాగే సీబీఐ, ఈడీ, కస్టమ్స్​ అధికారులమని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేశారు.

    Cyber Fraud | జాగ్రత్తగా ఉండాలి

    సైబర్​ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యాశకు పోయి మోసపోవద్దన్నారు. ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగాల పేరిట డబ్బులు డిమాండ్​ చేస్తే అది ఫేక్​ అని గుర్తించాలి. అలాగే ఎవరైనా అధికారుల పేరిట కేసు నమోదు చేస్తామని ఫోన్​ చేస్తే భయపడొద్దు. నిజమైన​ అధికారులు ఎవరూ అలా ఫోన్లు చేయరు. అలాంటి ఫోన్లు వస్తే సైబర్​ క్రైం నంబర్(Cyber ​​Crime Number)​ 1930కు ఫోన్​ చేయాలి. లేదంటే స్థానిక పోలీస్​ స్టేషన్​(Local Police Station)లో ఫిర్యాదు చేయాలి. సైబర్​ మోసానికి గురయినా.. వెంటనే 1930 నంబర్​కు ఫోన్​ చేస్తే ఆ డబ్బులను అధికారులు ఫ్రీజ్​ చేసి రీఫండ్ చేసే అవకాశం ఉంటుంది.

    READ ALSO  ACB Case | పట్టా పాస్​బుక్​ కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్​

    Latest articles

    Cabinet | నేడు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ముఖ్యమంత్రి...

    Prime Minister Modi | ఇందిర‌ను అధిగ‌మించిన మోదీ.. 4078 రోజులు ప్ర‌ధానిగా సేవ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prime Minister Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ‌రో రికార్డు సాధించారు. ప్ర‌ధానిగా అత్య‌ధిక...

    Donald Trump | ట్రంప్ పిచ్చి నిర్ణ‌యాలు.. ఆందోళ‌న‌లో నిపుణులు.. ఇండియ‌న్ల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్ద‌ని తాజా వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర...

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    More like this