అక్షరటుడే, ఇందూరు: ABVP | పోలీసులు తమ కార్యాలయానికి వచ్చి అక్రమంగా అరెస్టులు చేసి బెదిరించడాన్ని ఖండిస్తున్నామని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ (ABVP Indure Vibhag) కన్వీనర్ శశి అన్నారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ సభ్యత్వ నమోదు చేస్తున్నామన్నారు. అయితే తప్పుడు సమాచారంతో తమను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం తగదన్నారు. సభ్యత్వ నమోదుకు వెళ్లకుండా అడ్డుకున్నారని వారు ఆరోపించారు.
ABVP | స్కాల్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు (Scholarships), ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను (fee reimbursement) తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలను పట్టించుకోకుండా తమను అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. బకాయిలు విడుదల అయ్యేవరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు మొదటి వారంలో పదివేల మంది విద్యార్థులతో ఉద్యమం చేస్తామని వారు వెల్లడించారు. సమావేశంలో ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.