అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkata Reddy) మంగళవారం వివరాలు వెల్లడించారు.
తన బైక్ దొంగతనం జరిగిందని జగిత్యాల (Jagityala)కు చెందిన సయ్యద్ యూనుస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని బాబాన్ సాహెబ్ పహాడ్ వద్ద ఐదో టౌన్ పోలీసులు (5th Town Police) మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న బోధన్ పట్టణానికి చెందిన షేక్ ఇలియాస్, షేక్ సమీర్లను అరెస్టు చేశారు. మరో నిందితుడు షేక్ రియాజ్ పరారీలో ఉన్నారు. వివిధ ప్రాంతాలలో దొంగిలించిన 10 బైకులను పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.ఆరు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసును చేధించడంలో సహకరించిన విచారణ అధికారి, ఐదో టౌన్ ఎస్సై ఎం గంగాధర్, నార్త్ రూరల్ సీఐ బి శ్రీనివాస్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేశ్, సిబ్బంది ఏసీపీ అభినందించారు.
