అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police arrest horse : ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ntr district వత్సవాయిలో విచిత్ర కేసు నమోదు అయింది. ఓ గుర్రం గంజాయి విక్రయిస్తూ పోలీసులకు police arrested horse పట్టబడింది. దీంతో దానిని పోలీసులు ఠాణాకు తరలించారు. ఇప్పుడు ఠాణాలో దానికి రోజూ దాణా, గడ్డి తీసుకొచ్చి పెడుతున్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో కొందరు గంజాయి తాగుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. కానీ, పోలీసులను చూసి అక్కడున్న వారంతా పారిపోయారు. అయితే అక్కడ పోలీసులకు గుర్రం మాత్రమే దొరికింది.
దీంతో గంజాయి తాగే వారితో గుర్రం స్నేహంగా ఉందని, దానిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. గుర్రంపై స్వారీ చేస్తూ గంజాయి రవాణా చేస్తున్నారన్నది పోలీసుల అభియోగం. కాగా, అశ్వం అరెస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.