Homeక్రైంHyderabad | భారీగా పాతనోట్ల పట్టివేత.. నలుగురిని అరెస్ట్​ చేసిన పోలీసులు

Hyderabad | భారీగా పాతనోట్ల పట్టివేత.. నలుగురిని అరెస్ట్​ చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్​లో పెద్ద నోట్లను రద్దు (Demonization) చేసింది. అప్పటి వరకు ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది.

నోట్ల రద్దయి 9 ఏళ్లు అవుతున్నా ఇంకా అక్కడక్కడ పాత నోట్లు కనిపిస్తుండటం గమనార్హం. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసి కొత్తగా రూ.2 వేల నోటును తీసుకొచ్చింది. దానిని కూడా రద్దు చేసింది. అయినా ఇంకా రూ.500, రూ.1000 నోట్లు అక్కడక్కడ పట్టుబడుతున్నాయి.

Hyderabad | నారాయణగూడలో..

హైదరాబాద్​ నగరంలోని నారాయణగూడ (Narayanaguda)లో రద్దయిన నోట్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మూడు బ్యాగుల్లో పాత రూ.500, రూ.1000 నోట్లు సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.రెండు కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఏం చేయడానికి తీసుకు వెళ్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Hyderabad | గతంలో సైతం..

ఈ ఏడాది మార్చిలో సైతం నగరంలో భారీగా పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆబిద్​ అనే వ్యక్తి ముఠాను ఏర్పాటు చేసుకొని పాత నోట్ల చెలామణి కోసం యత్నిస్తుండగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ గ్యాంగ్​ నుంచి రూ.55,52,500 విలువైన రూ.1,000, రూ.500 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా నగరంలో తరుచూ పాత కరెన్సీ నోట్లు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.