Homeతాజావార్తలుAnde Sri | కవి, రచయిత అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభం

Ande Sri | కవి, రచయిత అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభం

అందెశ్రీ అంతిమయాత్ర లాలాగూడ నుంచి ప్రారంభం అయింది. ఘట్‌కేసర్​లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ande Sri | ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభం అయింది. ఆయన సోమవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

అందెశ్రీ (Ande Sri) అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్ వరకు అంతిమయాత్ర సాగనుంది. అంతిమ యాత్రలో మంత్రులు సీతక్క (Seethakka), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పాల్గొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సైతం హాజరు కానున్నారు.

కాగా అందెశ్రీ ఆదివారం రాత్రి తన ఇంట్లో అనారోగ్యానికి గురి అయ్యారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా.. సోమవారం ఉదయం మృతి చెందారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. చిన్న వయసులోనే అనాథగా పెరిగిన ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అదే సమయంలో కవిత్వం, గీతరచన వైపు ఆకర్షితమయ్యారు. చదువు లేకపోయినా తన ప్రతిభతో తెలుగు సాహిత్యంపై అద్భుతమైన పట్టు సాధించారు. అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

Must Read
Related News