అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pocso Case | ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌పై (Yash Dayal) వస్తున్న లైంగిక దాడి ఆరోపణలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం యశ్ దయాల్‌తో ఐదు సంవత్సరాలుగా తాను సంబంధం కలిగి ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నాడని ఓ యువతి ఆరోపణలు చేసింది. నేను వారి కుటుంబ సభ్యులకు తెలుసు, అలానే నా కుటుంబ సభ్యులకు కూడా యష్ దయాల్‌ని పరిచయం చేశానని సదరు యువతి తెలియజేసింది. శారీరక అవసరాలు తీర్చుకున్నాక, పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నాడని ఘజియాబాద్‌కు (Ghaziabad) చెందిన సదరు యువతి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సెక్షన్ 69 ప్రకారం దయాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు (FIR registered) చేశారు. దీనిపై స్పందించిన యష్ దయాల్.. అవన్నీ అవాస్తవాలు అని అన్నాడు. దీనిపై త్వరలోనే లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు.
Pocso Case | మరో కేసు..
ఈ కేసులో ప్రస్తుతానికి అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) నుంచి తాత్కాలిక బెయిల్ పొందాడు. ఈ వ్యవహారం ఇంకా చర్చల దశలో ఉండగానే, ఇప్పుడు జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల యువ క్రీడాకారిణి యశ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు మోపింది. తనను క్రికెట్‌లో స్టార్ చేస్తానని ఆశ చూపి, గత రెండేళ్లుగా పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు పోక్సో చట్టం (POCSO Act) కింద నమోదు కావడంతో, యశ్ దయాల్‌కి తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన నిర్ధిష్ట ఆధారాలతో అతనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
మొదటి కేసు నుండి ఏదోలా తాత్కాలికంగా తప్పించుకున్నా ఇది పోక్సో కేసు (POCSO case) కాబట్టి దాదాపు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకవైపు మైదానంలో అలరించిన యశ్ దయాల్, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఆరోపణల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇవి అతని క్రికెట్ కెరీర్‌పై (cricket career) తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు యశ్ దయాల్ తరఫున ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మొత్తానికి, ఐపీఎల్ స్టార్ IPl Star నుండి వివాదాల్లో చిక్కుకున్న ఆటగాడిగా యశ్ దయాల్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసాడు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో అన్నది విచారణ అనంతరం తేలాల్సి ఉంది.