Homeక్రైంSuryapet | కానిస్టేబుల్​పై పోక్సో కేసు.. ఎందుకంటే?

Suryapet | కానిస్టేబుల్​పై పోక్సో కేసు.. ఎందుకంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ఓ కానిస్టేబుల్​పై పోలీసులు పోక్సో కేసు (Pocso Case) నమోదు చేశారు. సూర్యాపేట (Suryapeta) జిల్లాకు చెందిన కానిస్టేబుల్​ ఓ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో అధికారులు ఇప్పటికే అతడిని సస్పెండ్​ చేశారు. తాజాగా పోక్సో కేసు నమోదు చేశారు.

సూర్యాపేట (Suryapet) జిల్లా నడిగూడెం పోలీస్​ స్టేషన్​లో కృష్ణంరాజు కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. అయితే ఆయనకు గతంలోనే మూడు పెళ్లిలు అయ్యాయి. 2023 నాలుగో సారి బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్​ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. సూర్యాపేట మండలానికి చెందిన బాలికను సదరు కానిస్టేబుల్​ వివాహం చేసుకోగా.. ఎస్పీ నరసింహ  (SP Narasihma) విచారణ చేపట్టి సస్పెండ్​ చేశారు. తాజాగా ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.

బాల్య వివాహాలను (Child Marriages) అరికట్టాల్సిన కానిస్టేబుల్​ బాలికను వివాహం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.