అక్షరటుడే, వెబ్‌డెస్క్ : POCO M7 PLUS 5G | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన పోకో (POCO) మరో మోడల్ ఫోన్‌ను తీసుకువస్తోంది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో తీసుకువస్తున్న ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌ను (Reverse charging) సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బుధవారం లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) అందుబాటులో ఉండనుంది.
పోకో ఎం7 ప్లస్ (POCO M7 PLUS) పేరుతో వస్తున్న ఈ మోడల్ ధర రూ. 15 వేల లోపు ఉండే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు లాంచింగ్ తర్వాత వెలువడనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.
6.9 ఇంచ్ సినిమాటిక్ స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్ 144 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. కళ్లకు హాని కలగకుండా చూసేందుకు ఇందులో TUV Rheinland ట్రిపుల్ సర్టిఫికేషన్ కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఇది 480000 అంటుటు స్కోర్ కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ OS 2 ఆపరేటింగ్ సిస్టమ్.
వెనుక భాగంలో 50 ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 7000 mAh. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో కూడినది. ఇది 18w రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ సెగ్మెంట్లో ఇదే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 12 గంటల నావిగేషన్, 24 గంటల వీడియో ప్లేబ్యాక్, 27 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్, 144 గంటల ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని ప్రకటించింది. ఇది మిడ్నైట్ బ్లాక్, టైటాన్ గ్రే, గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.