ePaper
More
    Homeటెక్నాలజీPoco F7 5G | మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను లాంచ్​ చేసిన పోకో.. ఎఫ్​...

    Poco F7 5G | మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను లాంచ్​ చేసిన పోకో.. ఎఫ్​ సిరీస్​లో బిగ్​ బ్యాటరీతో వచ్చేసిన ప్రీమియం మొబైల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Poco F7 5G | Xiaomi సబ్‌ బ్రాండ్‌ అయిన పోకో మరో మోడల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎక్కువగా బడ్జెట్‌ సెగ్మెంట్‌కు చెందిన ఫోన్‌లను అందించే ఈ కంపెనీ.. తన ప్రీమియం ఎఫ్‌ సిరీస్‌లో భారీ బ్యాటరీ సామర్థ్యంతో F7 5G పేరిట తీసుకువచ్చిన ఈ ఫోన్‌ ధర రూ. 34 వేలలోపే. వచ్చేనెల ఒకటో తేదీనుంచి ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లో సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్లు ఇవి..

    డిస్‌ప్లే: 6.83 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. 3,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, హెచ్‌డీఆర్‌ 10+కు సపోర్ట్‌ చేస్తుంది.

    ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 8s జనరేషన్‌ 4 అక్టాకోర్‌ ప్రాసెసర్‌ అమర్చారు.

    ఆపరేటింగ్‌ సిస్టమ్‌: ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత హైపర్‌ OS 2.0తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

    కెమెరా: 50 MP సోనీ ఐఎంఎక్స్‌ 882 ప్రధాన కెమెరా, 8 MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌ అమర్చారు. ఫ్రంట్‌ సైడ్‌ 20 MP కెమెరా ఉంది.

    బ్యాటరీ: భారీ బ్యాటరీ సామర్థ్యంతో దీనిని తీసుకువచ్చారు. దీని సామర్థ్యం 7,550 mAh. 90w ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 22.5 w వైర్డ్‌ రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. టెంపరేచర్‌ కంట్రోల్‌ కోసం 6000 mm sq వ్యాపర్‌ కూలింగ్‌ చాంబర్‌ సిస్టమ్‌ ఉంది. సింగిల్‌ ఛార్జ్‌తో 60 గంటల నిరంతర టాక్‌టైమ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌ సిస్టమ్‌ ఉంది.

    అదనపు ఫీచర్లు:కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌ కలిగి ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఇచ్చారు. ఐపీ 66+, ఐపీ 68+, ఐపీ 69 డస్ట్‌, వాటర్‌ ప్రూఫ్‌తో వస్తోంది. గూగుల్ జెమినీ, సర్కిల్‌ టు సెర్చ్‌, ఏఐ నోట్స్‌, ఏఐ ఇమేజ్‌ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌, ఏఐ ఇమేజ్‌ ఎక్స్‌ప్యాన్షన్‌ తదితర ఫీచర్లతో వస్తోంది.

    కార్డ్‌ ఆఫర్‌:ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేనెల ఒకటో తేదీనుంచి సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌(Flipkart axis bank credit card)తో 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

    కలర్స్‌:సైబర్‌ సిల్వర్‌ ఎడిషన్‌, ఫ్రాస్ట్‌ వైట్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

    వేరియంట్స్‌: ఈ మోడల్‌ను రెండు వేరియంట్ల(Variants)లో తీసుకువచ్చారు.
    12 GB + 256 GB ధర రూ.31,999.
    12 GB + 512 GB ధర రూ.33,999.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....