Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | అష్టముచ్చి ఆటతో జేబులు గుల్ల..!

Nizamsagar | అష్టముచ్చి ఆటతో జేబులు గుల్ల..!

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్‌: మండలంలో జాతర ఉత్సవాల్లో భాగంగా ఓవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగా, సందట్లో సడేమియా అన్నట్లుగా అదే స్థలంలో కొందరు అష్టముచ్చి(గోల్​) ఆట నిర్వహించారు. పోటీలు తిలకించేందుకు వచ్చే జనాన్ని టార్గెట్​ చేస్తూ ఈ ఆట నిర్వహించడం గమనార్హం. కొందరు ముఠాగా ఏర్పడి కుస్తీ పోటీలు నిర్వహిస్తున్న ప్రదేశంలోనే ఈ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఆటలో సరదాగా పాల్గొన్న ప్రజలు రూ. వేలల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. ముఖ్యంగా యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి ఆటలను నిషేధించాలంటూ గ్రామస్థులు కోరుతున్నారు.