అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pocharam’s son Bhaskar Reddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) తనయుడు భాస్కర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్‌రెడ్డిని పాండు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడంతో విచ్చలవిడిగా సంపాదించుకుని, అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారన్నారు. తమ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి వల్లనే బీఆర్ఎస్ నేతలు డబ్బులు సంపాదించుకున్నారని విమర్శించారు.
Pocharam’s son Bhaskar Reddy | ఖబర్దార్ జీవన్‌రెడ్డి..
జీవన్‌రెడ్డి తన తండ్రిని బాపూ అని పిలుస్తారని, అలాంటిది ఇప్పుడేమో పోచారం శ్రీనివాస్‌రెడ్డిని శని అంటూ పేర్కొనడం బాధాకరమన్నారు. ‘ఖబర్దార్ జీవన్‌రెడ్డి.. 2018లో 36 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన నీవు.. మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయావు.. అదీ నీ స్థానం.. ఈ విషయం అధిష్ఠానానికి కూడా తెలుసు..’ అని అన్నారు.
‘జీవన్‌రెడ్డి ఓ బ్రోకర్. తన పనులు చేయించుకునేందుకు ఎవరెవరి వద్ద ఎంత మంది అమ్మాయిలను పడుకోబెట్టారో తనకంతా తెలుసు. ఈ విషయం జీవన్‌రెడ్డిని ఇంటరాగేట్ చేస్తే.. అన్నీ కక్కేస్తారు’ అని చెప్పుకొచ్చారు.
Pocharam’s son Bhaskar Reddy | బాజిరెడ్డి గోవర్ధన్ మా మేనమామని చంపించారు..
నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిపై కూడా భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో బాజిరెడ్డి గెలిచి, రౌడీ రాజకీయాలు చేశారని.. తన మేనమామను చంపించింది బాజిరెడ్డినేనని ఆరోపించారు. 2014, 2018లలో పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఓడించేందుకు బాజిరెడ్డి, షకీల్, ఏనుగు రవీందర్‌రెడ్డి కలిసి తీవ్ర ప్రయత్నం చేశారన్నారు.
బాజిరెడ్డి ఆర్మూర్, అర్బన్.. తదితర నియోజకవర్గాల్లో వేలు పెట్టారని అందుకే అక్కడ బీఆర్ఎస్ BRS ఓడిపోయిందన్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్, గణేశ్ గుప్తా తిట్టారని.. అందరూ కలిసి ఒకరినొకరు ఓడగొట్టుకున్నారని అన్నారు.
స్పీకర్‌గా పని చేసిన వ్యక్తి తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని, ఇదే విషయంపై పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై అందరూ కామెంట్ చేశారని గుర్తుచేశారు. కానీ, పోచారం గెలిచి ఆ అపవాదును తూడిచిపెట్టారన్నారు.
Pocharam’s son Bhaskar Reddy | ప్రశాంత్‌రెడ్డిపై కూడా కామెంట్స్..
జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన ప్రశాంత్‌రెడ్డికి కామారెడ్డి జిల్లాలో మాత్రమే మర్యాద ఉండిందని పేర్కొన్నారు. ఆర్మూర్, అర్బన్, బోధన్, రూరల్ నియోజవర్గాల్లో ఎవరూ పట్టించుకోలేదన్నారు. జిల్లాలో పట్టులేని వ్యక్తికి మంత్రిగా పదవి ఎలా ఇచ్చారో తెలియదన్నారు.
అధికారులను ప్రశాంత్‌రెడ్డి తిట్టేవారన్నారు. ఎవరినీ సమన్వయం చేయలేదన్నారు. అసలు ప్రశాంత్‌రెడ్డి అంటే.. బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్, గణేశ్‌గుప్తా తదితరులెవరికీ పడకపోయేదన్నారు.
హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన గుత్తేదారుకు బిల్లు మంజూరు చేయించి, అతడి వద్ద రూ. 6 కోట్లు తీసుకుని నియోజకవర్గంలో పంచండం వల్లనే ప్రశాంత్‌రెడ్డి గెలిచారని ఆరోపించారు.
తనని బీసీసీఐ ఛైర్మన్ పదవి నుంచి తొలగించడంలోనూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించి.. తనని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతలతో కలిసి బీఆర్ఎస్కు కూడా వెన్నుపోటు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
