ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | సీఎం వస్తున్న వేళ.. పోచారం రోడ్డు మరమ్మతులు పూర్తి

    Yellareddy | సీఎం వస్తున్న వేళ.. పోచారం రోడ్డు మరమ్మతులు పూర్తి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (heavy rains) చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నుంచి మెదక్​, హైదరాబాద్​ తదితర ప్రధాన పట్టణాలను కలిపే పలు మార్గాల్లో రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

    Yellareddy | సీఎం పర్యటన నేపథ్యంలో..

    ఎల్లారెడ్డి మీదుగా మెదక్​, (Yellareddy-Medak) హైదరాబాద్​కు (Hyderabad) వెళ్లే మార్గంలో పోచారం గ్రామం (pocharam Village) వద్ద భారీ వరదలతో వంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదల కారణంగా కేవలం వంతెన మాత్రమే మిగిలిఉంది. ఇరువైపులా రోడ్డు నామరూపాల్లేకుండా పోయింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించింది.

    Yellareddy | యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి..

    సీఎం రేవంత్​రెడ్డి (CM Rtevanth Reddy) గురువారం జిల్లా పర్యటకు వస్తున్న నేపథ్యంలో పోచారం వద్ద వంతెన పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేశారు. వంతెనకు ఇరువైపులా గతంలో రోడ్లు కొట్టుకుపోగా.. ప్రస్తుతం మొరంతో రెండువైపులా రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ మార్గం గుండా భారీ వాహనాలు సైతం వెళ్తున్నాయి.

    గతంలో భారీవర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు ఇదే..

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...